అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)
అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే … పరిపూర్ణమైన పరిశుద్ధులతో (2)
” అదిగదిగో “
కల్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూ నే పరవసింతునే (2)
రాజాధిరాజు తో స్వప్నాల సౌధములో
విహరింతునే… నిర్మలమైన వస్త్రధారినై (2)
” అదిగదిగో “
జయించిన వాడై సర్వాధి కారియై
సింహాసనా సీనుడై నను చేర్చుకొనును (2)
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే … వేవేల దూతల పరివారముతో (2)
Leave a Reply