ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో

పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో
పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు

1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు
ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు
|| ఎవ్వని ||

2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి
ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను
|| ఎవ్వని ||

3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ
నా సారము వేసవిలో ఎండినట్లాయె
|| ఎవ్వని ||

4. నేను నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని
|| ఎవ్వని ||

5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
నీవు నా దోషమును మన్నించితివిగా
|| ఎవ్వని ||

6. కావున నీ దర్శన కాలమందు
భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు
|| ఎవ్వని ||

7. విస్తార జలప్రవాహములు పొర్లినను
నిశ్చయముగా నవి వారి మీదికి రావు
|| ఎవ్వని ||

8. నాకు దాగుచోటు నీవే శ్రమలో నుండి
నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా
|| ఎవ్వని ||

9. విమోచన గానములతో నీవు నన్ను
ఆవరించి నాకుపదేశము చేసెదవు
|| ఎవ్వని ||