పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి
|| దేవా ||
2. మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు
నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము
|| దేవా ||
3. డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము
అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును
|| దేవా ||
4. అయినను వాటి వైభవమంత – ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము
|| దేవా ||
5. నీకే జెందవలసినట్టి భయము – కొలది పుట్టినట్టి
నీదు ఆగ్రహ క్రోధ బలము – ఎవ్వరికి తెలియున్
|| దేవా ||
6. మాకు నీ జ్ఞాన హృదయమును – కలుగునట్లు చేయుము
మాదినములు లెక్కించుటకు – మాకు నీవే నేర్పుము
|| దేవా ||
Leave a Reply