నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే
శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం
అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను || రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును || నేను || అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను ||
Leave a Reply