మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)

కృపా సత్య సంపూర్ణమై

మా మధ్యలో నివసించుట న్యాయమా

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)

 

వినయముగల వారిని

తగిన సమయములో హెచ్చించువాడవని (2)

నీవు వాడు పాత్రనై నేనుండుటకై

నిలిచియుందును పవిత్రతతో (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)        ||మహా||

 

దీన మనస్సు గలవారికే

సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)

నీ సముఖములో సజీవ సాక్షినై

కాపాడుకొందును మెళకువతో (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||

 

శోధింపబడు వారికి

మార్గము చూపించి తప్పించువాడవని (2)

నా సిలువ మోయుచు నీ సిలువ నీడను

విశ్రమింతును అంతము వరకు (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||