Sannuthinchedanu Dayaaludavu Neevani - సన్నుతించెదను దయాళుడవు నీవని
సన్నుతించెదను - దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను ||2|| సన్నుతించెదను - దయాళుడవు నీవని 1. సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా ||2|| కృపాధారము నీవెగా షాలేమురాజా నిను సన్మానించెదను ||2|| ॥సన్ను|| 2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును ||2|| కృపానిధివి నీవెగా నా యేసురాజా నిను సన్మానించెదను ||2|| ॥సన్ను|| 3.ఇహపరమందున నీకు సాటిలేరయా ప్రగతిని కలిగించు రాజువు నీవయా ||2|| యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా నిను సన్మానించెధను. ||2|| ॥సన్ను||
Leave a Reply