స్తుతింతున్ స్తుతింతున్

యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే." కీర్తన Psalm 16:3-11

పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్
నాకాలోచన కర్తయగు దేవుని
రాత్రివేలలో నా
అంతరింద్రియములు నాకు నేర్పున్
1. నాదు స్వాస్థ్య పానీయ భాగము
నా యెహోవా నీవే కాపాడెదవు
మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్
|| స్తుతింతున్ ||

2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను
సదాకాలము యెహోవాయందు నా
గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్
|| స్తుతింతున్ ||

3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు
గాన కదల్చబడలేను ఎన్నడు
అందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్
|| స్తుతింతున్ ||

4. నా శరీరము సురక్షితంబుగా
నివసించుచున్నది ఏలననగా
నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్
|| స్తుతింతున్ ||

5. జీవముగల నీ మార్గమును
నీవు నాకిల తెలియ జేసెదవు
నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్
|| స్తుతింతున్ ||

6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో
సంపూర్ణ సంతోష మెంతో గలదు
నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్
|| స్తుతింతున్ ||

Psalm-16:3-11

Mubarak, mubarak

Pallavi : Stutinthun - stutinthun - naa kaalochana
karthayagu devuni - raatrivelalo naa
antharindriyamu naaku nerpun “Stutin”

1. Naadu swaastya paaneeya bhaagamu - naa Yehovaa
neeve kaapaadedavu - manohara stalamulalo
paalu kalgenu - stutinthun “Stutin”

2. Shresta maino swaastyamu naaku kalgenu - sadaa
Kaalamu Yehovaa yandu naa; gurini nilpu chunnaanu -
gana nenu stutin tun “Stutin”

3. Naa kudi paarshya mandaayana yunnaadu - gaana
kadalchabada lenu ennadu; andu che naa hrudaya
maanandinchunu - Stutintun “Stutin”

4. Naa shareeramu surakshithamabugaa nivasinchu
chunnadi elananagaa nee parishudduni kullu
pattaniyaavu - Stutintun “Stutin”

5. Jeevamu gala nee maargamunu - neevu naakila
theliya jesedavu - neeve naa kshemmaa dhaaramani
ninnu - Stutintun “Stutin”

6. Sarvonnathudaa nee sannidhilo
sampooma santosha mentho galadu - nee kudi
chethilo nitya sukhamulu galavu - Stutintun “Stutin”