నూతన యెరూషలేము | Nutana Yerusalemu

పల్లవి: నూతన యెరూషలేము పట్టణము
పెండ్లికై అలంకరింపబడుచున్నది (2)

1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2)
వారాయనకు ప్రజలై యుందురు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2)
ధుఃఖము లేదు మరణము లేదు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

3. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు (2)
ఎవరు దానిలో లేనే లేరు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

4. దేవుని దాసులు ఆయనను సేవించుదురు (2)
ముఖదర్శనము చేయుచు నుందురు (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||

5. సీయోనులో గొర్రె పిల్లయే మూలరాయి (2)
సీయోను పర్వతము మీదయు ఆయనే (2)
ఆనందం ఆనందం ఆనందమే (2)

|| నూతన ||