Premamaya Yesu Prabhuva | ప్రేమమయా – యేసు ప్రభువా
పల్లవి || ప్రేమమయా - యేసు ప్రభువా నిన్నే స్తుతింతును - ప్రభువా అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతింతును - ప్రభువా || ప్రేమ || చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || చ || ఎదవాకిటను - నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా హృదయాంగనములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే || ప్రేమ || చ || శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలముకొనినా శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమ ||
Leave a Reply