ఆదరణ కర్తవు

ఆదరణ కర్తవు అనాధునిగా
ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు

అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే
ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ”

నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ”

యేసయ్య ! యేసయ్య !
యేసయ్య ! యేసయ్య !!