ఇంతగ నన్ను ప్రేమించినది

Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది

ఇంతగ నన్ను - ప్రేమించినది 
నీ రూపమునాలో -  రూపించుటకా 
ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా 

శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా 
శిలనైనా నన్ను - నీవలె మార్చుటకా 
శిల్ప కారుడా - నా యేసయ్యా 
మలుచు చుంటివా - నీ పోలికగా || ఇదియే || 

తీగలు సడలి - అపస్వరములమయమై 
మూగబోయనే - నా స్వర మండలము 
అమరజీవ - స్వరకల్పనలు 
నా అణువణువునా - పలికించితివా || ఇదియే ||