నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే

నా గీతారాధనలో యేసయ్యా - నీ కృప ఆధారమే 
నా ఆవేదనలలో -  జనించెనే నీ కృపాదరణ 

నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే 
చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే 
నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే          || నా గీతా || 

చేనిలోని పైరు చేతికిరాకున్నా - ఫలములన్ని రాలిపోయినా 
సిరిసంపదలన్నీ దూరమైపోయినా - నేను చలించనులే 
నిశ్చలమైన రాజ్యముకొరకే - ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే       || నా గీతా || 

ఆత్మాభిషేకం - నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే 
ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే 
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు - నే వేచియుందునే నీ రాకడకై || నా గీతా ||