-
మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు
పల్లవి : మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు 1. ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడు రక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి || మహోన్నతుని || 2. తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగును ఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది || మహోన్నతుని || 3. రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనా చీకటిలో తిరుగు తెగులునకైనా…
-
దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే 1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి || దేవా || 2. మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము || దేవా || 3. డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును || దేవా…
-
ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే
1. ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే యుగ యుగములకు నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు 2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే నీవు వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు 3. నరపుత్రుల మంటికి మార్చి – తిరిగి రండని సెలవిచ్చెదవు వేయి సంవత్సరములు నీకు జామువలె, జామువలె, జామువలె, జామువలె 4. నీదు దుష్టికి వేయి ఏండ్లు – గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి…
-
ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము 2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు గురునికి వారలు జనులుగా నుండెదరు 3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా తన భక్తులకు రక్షణ సమీప మాయెను 4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి 5. భూలోకము లోనుండి సత్యము మొలుచు నాకాశములోనుండి నీతి పారజూచును 6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును 7.…
-
సైన్యముల యెహోవా
పల్లవి : సైన్యముల యెహోవా 1. యెహోవా మందిరము చూడవలెనని నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను || సైన్యముల || 2. జీవముగల దేవుని దర్శించ నా హృదయము నా శరీర మానంద కేక వేయుచున్నది || సైన్యముల || 3. సైన్యముల యెహోవా నా రాజా నీ బలి పీఠమునొద్దనే పిచ్చుకలకు గూళ్ళు దొరికెను || సైన్యముల || 4. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నా దేవా || సైన్యముల ||…
-
మన బలమైన యాకోబు దేవునికి
పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడీ అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి సితార స్వరమండలము వాయించుడి 1. అమావాస్య పున్నమ పండుగ దినములందు కొమ్మునూదుడి యుత్సాహముతోడ యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల కది కట్టడ || మన బలమైన || 2. తానైగుప్తులో తిరిగినప్పుడు యోసేపు సంతతికి సాక్షముగ నిర్ణయించెను దేవుడు అచ్చట నే నెనుగని భాషను నే వింటిని || మన బలమైన || 3.…
-
దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి
1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి చెవియొగ్గువరకు మనవి చేయుచుందును 2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును 3. పూర్వ సంవత్సరములను తలచుకొందును పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును 4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది 5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా? ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా? 6. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా? దేవుడు కోపముతో కృప చూపకుండునా? 7. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను…
-
యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
పల్లవి : యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అనుపల్లవి : షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను అక్కడి వాటిని విరుగగొట్టెను దుష్ట మృగములను పర్వతముల యందము కన్నను నీవెంతో తేజోమయుడవు || యూదాలో || 2. కఠినహృదయులు దోచుకొనబడి వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని – వారి బాహు…
-
క్రీస్తుని నామము నిత్యము నిల్చున్
1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ 2. అతనినిబట్టి మానవులెల్లరు తథ్యముగానే దీవించబడెదరు 3. అన్యజనులందరును అతని ధన్యుడని చెప్పుకొను చుందురు 4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు స్తుతింపబడును గాక 5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు చేయువాడు గాన స్తోత్రార్హుండు 6. ఆయన మహిమగల నామము నిత్యమును స్తుతింపబడును గాక 7. సర్వభూమి ఆయన మహిమచే నిండియుండును గాక ఆమెన్ ఆమెన్
-
నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు
1. నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు నీ రక్షణ అన్యులలో – తెలియబడు గాక || నీ మార్గము || 2. దేవుడు మమ్ము కరుణించి – దీవించును గాక ప్రకాశింపజేయుము నీ – ముఖకాంతిని మాపై || నీ మార్గము || 3. స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను || నీ మార్గము || 4. యెహోవా…