-
భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే
“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10 పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే 1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను || భూమియు || 2. యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు || భూమియు || 3. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే…
-
యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్ యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట 1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్ స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును || యేసు ప్రభూ || 2. మరణపులోయ ద్వారా…
-
యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ 1. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || 2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము || యెహోవా || 3. నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి…
-
నీవే యెహోవా నా కాపరివి
“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23 పల్లవి : నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువ లేదిలలోన 1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు సేదను దీర్చి నన్ను నడుపుము నీతిమార్గమున || నీవే యెహోవా || 2. గాఢాంధకార లోయలయందు పడియుండి నేను సంచరించినను తోడైయుందువు నీ దుడ్డుకర్ర దండముతో నీ వాదరించెదవు || నీవే యెహోవా ||…
-
యెహోవా నా కాపరి – లేమి కలుగదు
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదు పచ్చికలపై పరుండజేయుచున్నాడు 1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల చెంత నన్నడిపించుచున్నాడు || యెహోవా || 2. సర్వదా నాదు ప్రాణంబునకు సేద దీర్చుచున్నాడు యెహోవా || యెహోవా || 3. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను చక్కగా నడుపుచున్నాడు || యెహోవా || 4. చీకటి లోయలో నే తిరిగినను…
-
నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యా
“నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10 పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యా అనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు? 1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావు ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు || నాదు దేవా || 2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివి మొఱలిడి నిన్ను నమ్మిరి…
-
యాకోబు దేవుడాపద కాలంబుల యందు
“ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!” కీర్తన Psalm 20 పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందు నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక! 1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును || యాకోబు || 2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు నీ దహన బలులను అంగీకరించును గాక || యాకోబు || 3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన యంతటిని సఫలము చేసి నిన్ను గాచును || యాకోబు…
-
స్తుతింతున్ స్తుతింతున్
యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే.” కీర్తన Psalm 16:3-11 పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్ 1. నాదు స్వాస్థ్య పానీయ భాగము నా యెహోవా నీవే కాపాడెదవు మనోహర స్థలములలో పాలుకల్గెను – స్తుతింతున్ || స్తుతింతున్ || 2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను సదాకాలము యెహోవాయందు నా గురిని నిల్పుచున్నాను గాన నేను – స్తుతింతున్ || స్తుతింతున్ ||…
-
యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో
పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది 1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ బాలుర స్తుతి స్తోత్రములతో స్థాపించితివి నీవొక దుర్గము నేదాగునట్లు ఆశ్రయ దుర్గము || యెహోవా || 2. నీ చేతి పనియైన ఆకాశమును చంద్ర నక్షత్రములనే చూడగా వాని దర్శించి జ్ఞాపకము చేయ మానవుండు ఏపాటివాడు || యెహోవా || 3. నీకంటె మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి మహిమ ప్రభావ కిరీటమును వానికి…
-
అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు
పల్లవి : అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి 1. భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు ||అన్యజనులేల|| 2. ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వి వారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును ||అన్యజనులేల|| 3. పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీద నారాజునాసీనునిగా జేసి…