-
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు 1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| 2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||
-
అనాదిలో నియమించబడిన
అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల 1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌని యాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥ 2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥
-
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో ||నీతి|| ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి|| పరిమళ వాసనగ…
-
జీవించుచున్నది నేను కాదు
జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు 1 నేను నా సొత్తు కానేకాను !!2!! క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!! యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!! 2. యుద్ధము నాది కానేకాదు !!2!! యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు !!2!! యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు !!2!! 3. లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము…
-
వేల్పులలో బహుఘనుడా
వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు (2) నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత కృపనిచ్చేదవు. . . .|| వేల్పులలో || సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2) మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2)|| వేల్పులలో || ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో ఉన్నత…
-
సృష్టికర్తవైన యెహోవా
సృష్టికర్తవైన యెహోవానీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమమంటికి రూపమిచ్చినావుమహిమలో స్థానమిచ్చినావునాలో నిన్ను చూసావునీలో నన్ను దాచావునిస్స్వార్ధ్యమైన నీ ప్రేమామరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలోఏ తోడు లేని విషాదపు వీధులలోఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)యేసయ్యా నను అనాథగా విడువకనీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగానశించిపోతున్న నన్ను వెదకి…
-
దయగల హృదయుడవు
దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును “దయగల” 1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2 శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2 2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2…
-
అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా
అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా! ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా 1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే ఉన్నతముగ నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి నూతన వసంతములో చేర్చును జీవించెద నీ కొరకే – హర్షించెద నీ లోనే 2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే…
-
ఆర్భాటముతో ప్రధాన దూత
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు 1.అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే 2.పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము 3.వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన…
-
నీ బాహుబలము ఎన్నడైన
నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ 1.ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించినవారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం 2.సారవంతమైన తోటలో నను నాటితివి సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మబ్బులే కురిసెను…