• లెమ్ము తేజరిల్లుము

    లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే…

    readmore…

  • అదిగదిగో పరలోకము

    అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది (2) అల్ఫా ఒమేగ యైన  నా ప్రాణ ప్రియునికి నిలువెళ్ల నివేదించి మైమరతునే (2) నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే … పరిపూర్ణమైన పరిశుద్ధులతో (2)                                        …

    readmore…

  • మహాఘనుడవు మహోన్నతుడవు

    మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)   వినయముగల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని (2) నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో (2) హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)        ||మహా||   దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2) నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెళకువతో…

    readmore…

  • వందనాలు వందనాలు

    వందనాలు వందనాలు – వరాలు పంచే నీ గుణ సంపన్నతకు (2) నీ త్యాగ శీలతకు నీ వశమైతి నే – అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వందన|| 1. ఇహలోక ధననిధులన్నీ – శాశ్వతముకావని ఎరిగితిని (2) ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే – ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి ||వందన|| 2. యజమానుడా నీవైపు – దాసుడనై నా కన్నులెత్తగా (2) యాజక వస్త్రములతో ననుఅలంకరించి – నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే (2)  ||వందన|| 3.…

    readmore…

  • ఆశ్రయదుర్గము నీవని

    ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు – నీ తేజస్సుతో నింపినావు మరణాంధకారములో బంధించబడిన నీ జనులను మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు – నాఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్లు తెరచి సమృద్థిగానే సంపదలిచ్చావు నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక…

    readmore…

  • త్రియేక దేవుడైన

    త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండును 1. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసేనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. || త్రియేక || 2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే మేఘ మధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. || త్రియేక || 3. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగిపొర్లేనే జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే  || త్రియేక ||

    readmore…

  • సాగిపోదును

    సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును – ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును || నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును – నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును || శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును – మరి దేవుని…

    readmore…

  • విజయ గీతము మనసార నేను పాడెద

    విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ ఉత్తమమైన సంఘములో (2)        ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవినీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యమునీ పరిశుద్ధులలో చూపినది (2)        ||విజయ|| నూతన…

    readmore…

  • మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే

    పల్లవి: మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం ఓ మనసా ఇది నీకు తెలుసా! 1. దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా దిగులు చెందకే ఓ మనసా ౹౹మనసా౹౹ 2. ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా సంఘము ఎదుట నీవు సాక్షివైతివే ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా కలవరమేలనే ఓ మనసా ౹౹మనసా౹౹ 3. నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే కృపాతిశయముచే నీవు…

    readmore…

  • నీ కృప నిత్యముండును

    నీ కృప నిత్యముండునునీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నదిరక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లెకృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లెప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లెనీ…

    readmore…